రేంజ్‌రోవర్ కారు కొన్న టాలీవుడ్ యంగ్ హీరో.. వైర‌ల్‌గా ఫొటోలు!

January 25, 2021 at 8:47 am

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. ఇటీవ‌ల ప్రేయ‌సి ప‌ల్ల‌విని పెళ్లాడి ఓ ఇంటివాడు అయిన సంగ‌తి తెలిసిందే. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలని నిఖిల్ ప్లాన్ చేసుకున్నా.. క‌రోనా కార‌ణంగా కుటుంబ స‌భ్యులు మ‌రియు అత్యంత సన్నిహితుల మ‌ధ్య ప‌ల్ల‌వి మెడ‌లో మూడు ముళ్లు వేశాడు. ఇక పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ షూటింగ్స్‌లో బిజీ అయ్యాడు నిఖిల్‌.

ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 కాగా, గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ‘18 పేజస్’ మ‌రొక‌టి. ఇదిలా ఉంటే.. తాజాగా నిఖిల్ ఖ‌రీదైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోబయోగ్రఫీ కారు కొనుగోలు చేశాడు. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసిన నిఖిల్‌.. `అర్జున్ సురవరం’ విజయం సాధించడంతో నాకు నేను దీన్ని బహుబతిగా ఇచ్చుకున్నాను.

అయితే కొవిడ్ వల్ల ఇది నా దగ్గరకు రావడం కాస్త ఆలస్యమైంది అంటూ క్యాప్ష‌న్ రాశాడు. దీంతో నిఖిల్ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇక నిఖిల్ కొనుగోలు చేసిన కారు ధ‌ర రెండు కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. మొత్తానికి అర్జున్ సురవరం హిట్‌తో ఖరీదైన లగ్జరీ కారుకి య‌జ‌మానిగా మారాడు నిఖిల్‌.

రేంజ్‌రోవర్ కారు కొన్న టాలీవుడ్ యంగ్ హీరో.. వైర‌ల్‌గా ఫొటోలు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts