
టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని తాజా చిత్రం `రెడ్`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
సినిమాల విషయం పక్కన పెడితే.. టాలీవుడ్ మోస్ట్ బ్యాచులర్ హీరోల లిస్ట్‌లో రామ్ పోతినేని ఒకరు. దీంతో ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా.. రామ్‌ను పెళ్లి ప్రశ్నలు అడగక మానరు. తాజాగా కూడా అదే జరిగింది. అయితే ఈ సారి కాస్త ఫన్నీగా అన్సర్ చెప్పాడు రామ్. రెడ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్‌ను.. మీ సీతను ఎప్పుడు పరిచయం చేస్తారు..? అని ఒకరు ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా..నాకు పరిచయం అయ్యాక అప్పుడు పరిచయం చేస్తానని రామ్ అన్నారు. అయితే ఎప్పటిలాగానే పెళ్లి గురించి మాత్రం పెద్దగా సాగదీయకుండా అక్కడికే కట్ చేసేశాడు. మరి రామ్‌కు తన లైఫ్ పార్టనర్ ఎప్పుడు పరిచయం అవుతుందో.. ఆమెకు అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాల్సి ఉంది.