వారే నాకు అస‌లైన పోటీ.. రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

January 17, 2021 at 10:24 am

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో త‌న మార్కెట్‌ను అమాంతం పెంచుకున్న‌ టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజా చిత్రం `రెడ్‌`. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా న‌టించారు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్‌గా నిలిచింది. క‌లెక్ష‌న్స్ పరంగా బాక్సాఫిస్ వ‌ద్ద రెడ్ చిత్రం దుమ్ముదులిపేస్తుంది.

ఈ నేపథ్యంలో శనివారం వైజాగ్‌లో రెడ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. శ్రీముఖి హోస్ట్ చేసిన ఈ వేడుకలో రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రామ్ మాట్లాడుతూ.. `ఈ సినిమా ముందు వరకూ ఒక లెక్క. ఇకపై ఒక లెక్క. సినిమాలో ట్విస్టులకన్నా సినిమా రిలీజ్ తర్వాతే పెద్ద ట్విస్ట్ జరిగింది. విడుద‌లైన రోజు ఉద‌యం మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకున్న రెడ్‌.. సాయంత్రానికి కల్లా హిట్ టాక్ తెచ్చుకోవ‌డం నిజంగా ఆనందంగా ఉంది.

ఇక సరిగ్గా 15 సంవత్సరాల క్రితం సంక్రాంతి సందర్భంగానే నేను ‘దేవదాసు’తో ఇండస్ట్రీలోకి వచ్చాను. అయితే నీకు కాంపిటేషన్ ఎవరని చాలా మంది అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్పగలను. ఫ్యాన్సే నాకు నిజమైన పోటీ. వారు చూపించే ప్రేమ కన్నా, నా నటనతో వారిని అలరించడంలో నేనే ముందుంటానని చూపడమే నా టార్గెట్` అని రామ్ తెలిపాడు. ఇక రామ్ కామెంట్స్ అభిమానుల‌ను తెగ ఆక‌ట్టుకుంటున్నాయి.

వారే నాకు అస‌లైన పోటీ.. రామ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts