
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన హీరో రామ్ పోతినేని.. ఇటీవల `రెడ్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేతా పెతురాజ్ హీరోయిన్లు నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని హిట్‌గా నిలిచింది.
ఇక రామ్ రెడ్ చిత్రం తర్వాత ఏ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీనిపై ఇప్పటికే ఎలాంటి ప్రకటనా రాకపోయినా.. తాజాగా రామ్‌కు.. ఛలో, భీష్మా వంటి సినిమాలతో హిట్ కొట్టి సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వెంకి కుడుము ఓ కథ చెప్పాడట. కానీ రామ్ ఆ సినిమా రిజెక్ట్ చేసి.. వెంకీని నిరాశ పరిచారట.
అయితే రామ్ వెంకీ సినిమాను ఒప్పుకోకపోవడానికి కారణం.. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల తరహలోనే నెక్ట్స్ మూవీ కూడా మాస్ స్టోరీ కావాలని భావిస్తున్నాడని అంటున్నారు. ఇక అయితే వెంకి కుడుముల స్టోరీ కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో.. రామ్ రిజెక్ట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.