
హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ హీరో అయినప్పటికీ.. టాలీవుడ్లో కూడా ఈయనకు మంచి మార్కెట్ ఉంది. నటుడిగానే కాకుండా మరోవైపు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి పదవులను చేపట్టి విశాల్ సత్తా చాటుతున్నారు.
ఇక ప్రస్తుతం విశాల్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. డిటెక్టివ్ 2తో పాటు చక్ర అనే సినిమాలోనూ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లాలో నిర్వహించిన కోడి పందాల్లో సందడి చేశారు. గుడ్లవల్లేరు మండలం, డోకిపర్రులోని శ్రీ భూ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశాడు.
అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోడి పందాలను అందరూ కలిసి తిలకించారు. ఇక విశాల్ వచ్చిన విషయం తెలిసుకున్న అభిమానులు మరియు స్థానికులు ఆయనను చూసేందుకు పోటీపడ్డారు. మరి కొందరు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.