మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న య‌ష్..ఫోటోలు వైర‌ల్‌!

January 19, 2021 at 12:01 pm

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిన `కేజీఎఫ్‌` సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు యష్‌‌. ఈ చిత్రంతో రాకీ భాయ్‌గా ఓవర్‌ నైట్‌లో స్టార్ అయిన య‌ష్.. ప్ర‌స్తుతం కేజీఎఫ్ చాప్ట‌ర్ 2లో న‌టిస్తున్నాడు.

 KGF Star Yash: కేజీయఫ్ హీరో యష్ ప్రస్తుతం మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. కేజీయఫ్ షూటింగ్ ముగించుకున్న యష్ తాజాగా తన భార్య పిల్లలతో సాగరతీరాన సేదతీరుతున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే ఇటీవ‌ల కేజీఎఫ్ షూటింగ్ ముగించుకున్న యష్.. తాజాగా తన భార్య పిల్లలతో మాల్దీవ్స్ వెళ్లారు. అక్క‌డ ఫ్యామిలీతో సాగరతీరాన సేదతీరుతూ య‌ష్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

 KGF Star Yash: మాల్దీవ్స్ కేజీయఫ్ హీరో యష్.. భార్య పిల్లలతో సాగరతీరాన రాకింగ్ స్టార్ ఎంజాయ్.. Photo : Instagram

కాగా,యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ఇతని భార్య రాధిక పండిట్ కూడా ఓ హీరోయినే. నిజానికి ఆమె నటించిన ‘మోగ్గినా మనసు’ చిత్రంతో కన్నడ సినీ రంగ ప్రవేశం చేశాడు యష్. ఈ చిత్ర స‌మ‌యంలోనే య‌ష్‌, రాధికల మ‌ధ్య ప్రేమ చిగురించి. ఆ త‌ర్వాత కొన్నేళ్లు డేటింగ్ చేసిన వీరిద్ద‌రూ.. చివ‌ర‌కు వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. ప్ర‌స్తుతం వీరికి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

 KGF Star Yash: మాల్దీవ్స్‌లో కేజీయఫ్ హీరో యష్.. భార్య పిల్లలతో సాగరతీరాన రాకింగ్ స్టార్ ఎంజాయ్.. Photo: Instagram

 KGF Star Yash: మాల్దీవ్స్ కేజీయఫ్ హీరో యష్.. భార్య పిల్లలతో సాగరతీరాన రాకింగ్ స్టార్ ఎంజాయ్.. Photo : Instagram

 

మాల్దీవ్స్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న య‌ష్..ఫోటోలు వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts