‘కేజీఎఫ్-2`కు హీరో య‌ష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే షాకే?

January 23, 2021 at 7:42 am

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్- డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ స‌త్తా చాటిన ఈ చిత్రానికి ఇప్పుడు కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2 రాబోతోంది. యంగ్ ప్రొడ్యూస‌ర్ అహొంబ‌లే ఫిలింస్ అధినేతి విజ‌య్ కిర‌గందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విడుద‌ల‌కు సిద్ధం అవుతున్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల విడుదలైన పోస్టర్లు , టీజర్ సినిమాపైనే అంచనాలను ఆకాశానికి చేర్చాయి. దీంతో ప్ర‌స్తుతం ఇండియా వైడ్‌గా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా చూసెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ విష‌యం ఇప్పుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. కేజీఎఫ్ 1 కంటే ఎక్కువ‌గా కేజీఎఫ్ 2కు య‌ష్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ట‌. కేజీఎఫ్ పార్ట్ 1 కు 11 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న య‌ష్.. ఇప్పుడు పార్ట్ 2 కి ఏకంగా ముప్పై కోట్లు తీసుకున్నాడని ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, లాభాల్లో షేర్ కూడా తీసుకుంటున్నట్లు కన్నడ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక మ‌రోవైపు నిర్మాత‌లు ఈ సినిమాకు దాదాపు 150 కోట్ల‌కు పైగానే పెట్టార‌ట‌.

‘కేజీఎఫ్-2`కు హీరో య‌ష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే షాకే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts