చీరతో పల్టీలు కొట్టిన అదాశర్మ..!!

January 12, 2021 at 3:55 pm

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హార్ట్ ఎటాక్ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయిన అందాల భామ ఆదా శర్మ. ఆ తరువాత పెద్దగా సినీ అవకాశాలు లేకపోవడంతో అడపా దడపా వచ్చిన మూవీస్ చేస్తూ వచ్చింది ఆదా. కేవలం గ్లామర్ చూపించే కోసం చిన్న చిన్న సన్నివేశాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ మూవీస్ సంగతేమో కానీ అదా సోషల్ మీడియాలో ఎప్పుడు ఫుల్ యాక్టివ్. రెగ్యులర్ గా తన హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆనంద పరుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల భామ ‌ అదాశర్మ చీర కట్టులో పల్టీలు కొట్టింది. అందమయిన సముద్ర తీరంలో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్ల అంతా వావ్సూపర్బ్ అదా అంటున్నారు.

చీరతో పల్టీలు కొట్టిన అదాశర్మ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts