యాంకర్ వర్షిణి కోసం హైపర్ అది ఖరీదైన గిఫ్ట్..

January 2, 2021 at 3:20 pm

ప్రస్తుతం బుల్లితెరపై జంటలు ట్రెండింగ్ గా మారారు. జబర్దస్త్ లో యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ మధ్య జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. అటు జబర్దస్త్ లో మాత్రమే కాదు, ఢీ షోలో కూడా వీరిద్దరినీ బాగా ఉపయోగించుకుంటున్నారు మల్లెమాల వారు. వీరిద్దరి తర్వాత ఆ రేంజ్ లో ఆకట్టుకోకపోయినప్పటికీ, ఓ మాదిరి కెమిస్ట్రీని హైపర్ ఆది, వర్షిణి క్రియేట్ చేశారు. హైపర్ ఆది, వర్షిణి ఇద్దరూ కలిసి మంచి కెమిస్ట్రీ కనబరుస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఢీ షోలో యాంకర్ వర్షిణి, హైపర్ ఆది ఇద్దరూ కలిసి పండిస్తన్న కెమిస్ట్రీకి ఇప్పుడిప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు నెటిజన్స్.

ఇటీవల ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న వర్షిణి తనకు ప్రేమ పట్ల అంత ఇంట్రెస్ట్ లేదంటూ హైపర్ ఆది ముందే చెప్పింది. కానీ హైపర్ ఆది మాత్రం ఇవేవీ పెద్దగా పట్టించుకోకుండా ట్రై చేస్తూనే ఉన్నాడని వార్తలు వస్తున్నాయ్. మరోవైపు ఇటీవల వర్షిణికి హైపర్ ఆది ఓ సర్ ప్రైజ్ బహుమతి ఇచ్చేందుకు రెడీ అయ్యాడని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఏమయ్యిఉంటుందని అని అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఇంతకీ ఆ సర్ ప్రైజ్ గిఫ్ట్ వర్షిణి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

యాంకర్ వర్షిణి కోసం హైపర్ అది ఖరీదైన గిఫ్ట్..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts