నా భార్య తెలుగు అమ్మాయే అంటున్న విలన్…!?

January 17, 2021 at 3:28 pm

లాక్ డౌన్లో సొంత ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డ ఎంతో మంది కార్మికులను వారి ఇళ్లకు చేర్చి వారి పాలిట రియల్ హీరో అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఇప్పుడు ప్రజల దృష్టిలో సోనూ రియల్ లైఫ్ హీరో అయిన తరుణంలో దర్శకులు కూడా ఆయన కోసం ప్రత్యేకంగా కథలు రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు 50 రోజులపైబడి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎముకలు కొరికే చలిలో నిరసన తెలుపుతున్నారు.

ఈ క్రమంలో సోనూ సూద్ ప్రధాన పాత్రలో కిసాన్ పేరుతో ఓ చిత్రాన్ని ప్రకటించాడు దర్శకుడు ఇ.నివాస్. ఇంకా సోనూసూద్ తెలుగులో కూడా పలు చిత్రాల్లో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవల ఆ చిత్రం కోసం పనిచేస్తున్న కార్మికులు వంద మందికి వంద ఫోన్లు కూడా బహూకరించాడు. లేటెస్ట్ గా సంక్రాంతికి విడుదల అయిన అల్లుడు అదుర్స్ లోనూ నటించాడు సోనూ సూద్. ఈ మూవీ సక్సెస్ మీట్ లో సోనూ మాట్లాడుతూ నేను తెలుగు వారి అల్లుడినే నా భార్య తెలుగు అమ్మాయే అని చెప్పుకొచ్చాడు. తాను ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా తెలుగు సినిమానే తన ఫస్ట్ లవ్ అని అన్నారు సోనూ.

నా భార్య తెలుగు అమ్మాయే అంటున్న విలన్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts