వైరల్ : ఎత్తు పెరుగు ఎందుకు ఆపరేషన్..!?

January 21, 2021 at 1:51 pm

అందరిలా తాము ఎత్తుగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఎత్తుగా లేమని కొంత మంది బాధ పడుతుంటారు కూడా. కనీసం ఆరు అడుగుల ఎత్తు ఉండాలని కోరు కుంటారు. ఇందుకు ఏవేవో ప్రయోగాలు కూడా చేస్తారు.ఎత్తు పెరిగేందుకు కావాల్సిన ప్రయత్నాలు కూడా చేస్తారు. ఇవి కొందరికీ సాధ్యమౌతుంది. మరికొంతమందికి సాధ్యం అవ్వకపోవచ్చు. కానీ అమెరికాకు చెందిన ఓ యువకుడు మాత్రం ఎత్తు పెరిగే విషయంలో సక్సెస్ అయ్యాడు. ఏకంగా ఆపరేషన్ చేయించుకుని మరియు తాను అనుకున్న ఎత్తు పెరిగాడు.

అమెరికాకు చెందిన అల్ఫోన్సో ఫ్లోరెస్ కు 28 సంవత్సరాల వయస్సు ఇతని ఎత్తు 5 ఫీట్ల 11 ఇంచుల ఎత్తు ఉన్నాడు. కానీ తనకు ఆరు ఫీట్లు ఎత్తు ఉండాలని ఎప్పటినుండో కోరిక. చిన్నప్పటి నుంచే కలలు దానికోసం కళలు కూడా కనేవాడు. ఈ క్రమంలో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దేబీ పర్షద్ ను సంప్రదించి లింబ్ప్లాస్ట్స్ ఇన్స్టిట్యూట్ లో డాక్టర్ ఆపరేషన్ అవసరం పడుతుందని తెలిపారు. లింగ్ లెంథనింగ్ సర్జరీ ద్వారా అల్ఫోన్సో కి ఎత్తు పెంచారు. సర్జరీ అనంతరం అల్ఫోన్సో ఇప్పుడు 6 ఫీట్ల ఒక ఇంచు ఉన్నాడు. దీంతో అతని సంతోషానికి అంతు లేదు. ఈ ఎత్తు రావడానికి ఏడు నెలల వ్యవధి పట్టింది.

అసలు ఏం చేసారంటే కాళ్లలోని ఎముకలకు రంధ్రం చేసి వాటిని రెండుగా విడదీసి తర్వాత వాటి మధ్య లోహంతో చేసిన ఓ రాడ్ ను అమర్చి కావాల్సిన పరిణామానికి చేరు కొనే వరకు ప్రతి రోజు దానిని ఒక్కో మిల్లిమీటర్ వరకు పెంచుతూ వచ్చారు. కాలి ఎముకలను కట్ చేసి ఓ డివైజన్ ను ఇన్సర్ట్ చేయడమే కాస్మోటిక్ లింబ్ లెంథినింగ్ సర్జరీ పద్ధతి అని దేబీ పర్షద్ వివరించారు.

వైరల్ : ఎత్తు పెరుగు ఎందుకు ఆపరేషన్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts