గ్యాస్ వినియోగదారులకు శుభవార్త…!?

January 13, 2021 at 2:07 pm

గ్యాస్ సిలిండర్ కస్టమర్లుకు అదిరిపోయే శుభవార్త అందబోతోంది. ఎల్‌పీజీ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రోజులు కొద్ది వేచి చూడాల్సిన పని ఇక ఉండదు. కొత్త సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. దీంతో గ్యాస్ సిలిండర్ ఉపయోగించే వారికి కొంత ఊరట ఉండబోతుంది.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOCL తత్కాల్ గ్యాస్ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. దీని కోసం తత్కాల్ ఎల్‌పీజీ సేవలను ఆవిష్కరించనుంది. దీంతో కస్టమర్లు బుక్ చేసిన రోజునే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ అవుతుంది.తత్కాల్ ఎల్‌పీజీ సేవలను అందించడానికి వీలుగా ప్రతి రాష్ట్రంలోనూ కనీసం ఒక్క పట్టణం లేదా జిల్లాను గుర్తించండి. ఈ సేవల కింద కస్టమర్లకు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత 30 నుంచి 45 నిమిషాల్లో గ్యాస్ సిలిండర్‌ను అందించడానికి ప్రయత్నిస్తాం అని ఐఓసీఎల్ టాప్ మేనేజ్‌మెంట్ చెప్పింది.

అయితే ఈ కొత్త సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయో ఇంకా కచ్చితంగా చెప్పలేదు. కానీ ఫిబ్రవరి 1 కల్లా అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ తన కస్టమర్లకు ఇండేన్ గ్యాస్ రూపంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ సర్వీసులు అందిస్తున్నసంగతి మనకు తెలిసిందే. 14 కోట్ల మంది కస్టమర్లకు ఈ సేవలు అందిస్తోంది. ఐఓసీఎల్ మరీ ముఖ్యంగా సింగిల్ సిలిండర్ ఉపయోగిస్తున్న వారు లక్ష్యంగా ఈ కొత్త సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. సింగిల్ సిలిండర్ అయిపోయిన వారు మళ్లీ సిలిండర్ వచ్చేంత వరకు ఇబ్బందులు పడుతుంటారు. అలంటి వారికీ వెంటనే సిలిండర్ డెలివరీ అయ్యేలా కంపెనీ ఇటువంటి నిర్ణయం తీసుకుంటోంది. కాబ్బటి ఇకమీదట ఒక సిలిండర్ ఉపయోగించేవారికి వినియోగదారులకు ఈ కొత్త సేవలు ద్వారా లబ్ది పొందుచు. ఎలాంటి ఇబ్బంది పడకుండా, వేచిచూడకుండా సిలిండర్ పొందవచ్చు.

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts