ప్రయాణకులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించిన ఇండిగో, స్పైస్‌జెట్..!?

January 15, 2021 at 1:56 pm

స్పైస్‌జెట్ సంస్థ 5 రోజుల బుక్ బేఫికర్ సేల్ ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 17 అర్థరాత్రి వరకు ఉంటుంది. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించాలనుకునేవారు రూ.899 ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ టు బెళగావి, బెళగావి టు హైదరాబాద్, జమ్మూ టు శ్రీనగర్, శ్రీనగర్జ టు జమ్మూ, బెంగళూరు టు చెన్నై, చెన్నైటు బెంగళూరు, అహ్మదాబాద్ టు జైసల్మేర్, జైసల్మేర్టు టు అహ్మదాబాద్ లాంటి రూట్స్‌లో రూ.899 ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునే సఉల్బయం కల్పిస్తుంది. ఈ వివరాలన్నీ https://www.spicejet.com/ వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు.

ఇక స్పెషల్ ఆఫర్‌లో భాగంగా కాంప్లిమెంటరీ ఫ్లైట్ వోచర్‌ను కూడా అందిస్తోంది స్పైస్‌జెట్. ప్రతీ ప్రయాణికుడికి రూ.1,000 వోచర్‌ను ఇస్తుంది. ఈ ఫ్లైట్ వోచర్‌ను 2021 ఫిబ్రవరి 28 లోగా వినియోగించుకోవచ్చు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య బుక్ చేసుకునే ఫ్లైట్లకు మాత్రమే రూ.1,000 వోచర్ వర్తిస్తుంది. ఇంకా వీటితో పాటు ఫ్లైట్ ఛేంజ్, క్యాన్సలేషన్‌ ఛార్జీలను కూడా మినహాయిస్తోంది. కాబట్టి ప్రయాణికులు తమ టికెట్లను ఎలాంటి ఛార్జీలు లేకుండా మాడి ఫై చేయొచ్చు లేదా క్యాన్సిల్ చేయొచ్చు.

ప్రయాణకులకు బంపర్ ఆఫర్స్ ప్రకటించిన ఇండిగో, స్పైస్‌జెట్..!?
0 votes, 0.00 avg. rating (0% score)