రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన ఐరిష్ బ్యూటీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!

January 23, 2021 at 8:28 am

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. చరిత్రలో ఎన్న‌డు కలవని వీరులు అల్లూరి సీత‌రామ‌రాజు, కొమ‌రం భీములు.. క‌లిస్తే ఎలా ఉంటుంది అనే క‌ల్పిత క‌థ‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ ప్రారంభం అయింది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లో అలియా భట్, ఒలీవియా మోరిస్, ఐరిష్ నటి అలిసన్ డూడీ, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని వంటి స్టార్లు భాగ‌మ‌య్యారు. అయితే వీరిలో ఐరిష్ బ్యాటీ అలిస‌న్ డూడీ తాజాగా రాజ‌మౌళికి భారీ షాక్ ఇచ్చింది.

ఇటివలే ఈ సినిమా షూటింగ్‏లో పాల్గొన్న అలిస‌న్ డూడీ.. తాజాగా తన ట్విట్టర్‏లో ఈ సినిమా గురించి స్పందిస్తూ పొరపాటున విడుదల తేదీని ప్రకటించేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా అక్టోబర్ 8న విడుదలవుతోందంటూ చెప్పేసింది. దీంతో రాజ‌మౌళికి, ఆర్ఆర్ఆర్ టీమ్‌కు పెద్ద షాక్ త‌గిలింది. కానీ, అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారు.

రాజ‌మౌళికి షాక్ ఇచ్చిన ఐరిష్ బ్యూటీ.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts