
సినీ ఇండస్ట్రీలో అటు తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ గా మారిపోయింది కీర్తి సురేశ్. ఈ అందాల భామ తాజాగా మహేశ్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. పరశురాం డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. మహానటి కోసం బరువు పెరిగిన ఈ భామ ఆ తర్వాత మళ్లీ సైజ్ జీరో లుక్ లోకి వచ్చింది. అయితే సైజ్ జీరో లుక్ లో కీర్తిసురేశ్ ని చుసిన అభిమానులు కాస్త ఫీలయ్యారు.
కానీ ఈ సారి సర్కారు వారి పాట కోసం మరో 10 కిలోలు బరువు పెరిగినట్టు సమాచారం. కీర్తిసురేశ్ లైట్ గోల్డెన్ కలర్ శారీ లుక్‌లో చాలా చబ్బీ చబ్బీ గా కనిపిస్తూ ఫొటోషూట్ లో పాల్గొంది. కీర్తిసురేశ్తళుకు ఈ కొత్త లుక్ ప్రిన్స్ మహేశ్‌బాబు కోసమేనా అంటూ తెగ రచ్చ చేస్తున్నారు సినీఅభిమానులు. మరి ఈ స్టిల్స్ కేవలం ఫొటో షూట్ కోసమేనా లేదా మూవీ కోసమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.
Happy Pongal! ❤️#SareeLove #HappyPongal2021 pic.twitter.com/R7lTnRHA6n
— Keerthy Suresh (@KeerthyOfficial) January 14, 2021