లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య ‌త్రిపాఠి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?

January 27, 2021 at 2:37 pm

అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ హృదయాలను దోచుకున్న ఉత్త‌రాది భామ లావ‌ణ్య‌త్రిపాఠి. ఈ సినిమా త‌ర్వాత ప‌లు ప్రాజెక్టుల్లో న‌టించి హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. ఈ భామ తాజాగా సందీప్‌ కిషన్ తో క‌లిసి ఏ1 ఎక్స్ ప్రెస్ చిత్రంలో మెరిసింది. లావ‌ణ్య ఈ చిత్రంలో లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందా అంటూ ఏ1 ఎక్స్ ప్రెస్ ట్రైల‌‌ర్ ను వీక్షించిన ప్రేక్ష‌కులు చెవులు కోరుకుంటున్నారు.

గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపించిన లావ‌ణ్య ట్రైల‌ర్ లో లిప్ లాక్ సీన్ లాంటి స‌న్నివేశం కనిపించడంతో సిల్వ‌ర్ స్క్రీన్ పై లావ‌ణ్య త్రిపాఠి నిజంగానే ముద్దు సీన్ల‌లో న‌టించిందా అని పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. లావణ్య న‌టించిన ఏ 1 ఎక్స్‌ప్రెస్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రి లావ‌ణ్య ఈ సారి తాను చేస్తున్న రోల్స్ కోసం తన లిమిట్స్ దాటనుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

లిప్‌లాక్ సీన్ కు లావ‌ణ్య ‌త్రిపాఠి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts