శారీలో తళుక్కుమన్న ఇషారెబ్బా..!!

January 16, 2021 at 3:53 pm

తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా శారీలో తళుక్కుమంది తెలుగమ్మాయి ఇషా రెబ్బా. సంక్రాంతి పండుగ కళను అందరికి గుర్తుకు తెచ్చింది. ఈ డిజైనర్ లుక్ లో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తూ కవ్విస్తుంది. స్పెషల్ డిజైనర్ పట్టు చీర ఇంకా దానికి కాంబినేషన్ భారీ జువెలరీతో చాలా ఆకర్షణీయంగా మెరిసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇషా ఫుల్ బిజీగా ఉంది.

అగ్ర కథానాయకుల చిత్రాల్లో సైతం కధకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే కథానాయికగానూ ఈ వయ్యారి భామ రాణిస్తోంది. త్వరలో రానున్న అఖిల్ మో స్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న ఈ బ్యూటీ, ఆయిరమ్ జెన్మంగళ్ అనే తమిళ సినిమాలోనూ నటిస్తోంది. లస్ట్ స్టోరీస్ అనే తెలుగు వెబ్ సిరీస్ లోనూ వేడి పెంచే పాత్రలో ఇషా నటిస్తోంది. అతి త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

శారీలో తళుక్కుమన్న ఇషారెబ్బా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts