రీమేక్‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ న‌భాన‌టేశ్‌..!!

January 22, 2021 at 3:10 pm

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో మంచి విజయం పొందిన భామ న‌భాన‌టేశ్‌. ఈ సినిమాలో తెలంగాణ యాస‌లో న‌భాన‌టేశ్ న‌ట‌న‌కు మంచి గుర్తింపు పొందింది. ఇస్మార్ట్ శంక‌ర్ స‌క్సెస్ త‌ర్వాత న‌భాకు ఆఫ‌ర్లు బానే వ‌చ్చాయి. మాస్ రాజా హీరో ర‌వితేజ‌తో క‌లిసి న‌టించిన డిస్కో రాజా ఆశించిన హిట్ సాధించలేదు. ఆ త‌ర్వాత సాయిధ‌ర‌మ్‌తో న‌టించిన సోలో బ్ర‌తుకే సో బెట‌ర్‌, బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ కూడా న‌భాన‌టేశ్‌కు పెద్ద హిట్గా నిలవలేకపోయాయి.

ప్ర‌స్తుతం ఈ భామ‌ హీరో నితిన్ తో క‌లిసి అంధాధున్ తెలుగు రీమేక్ లో చేస్తుంది. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత వ‌చ్చిన మూడు సినిమాలు త‌న‌కు పెద్దగా విజయం తీసుకురాలేకపోవటంతో ఇపుడు తన ఆశ‌ల‌న్నీ ఈ రీమేక్ మూవీ పైనే పెట్టుకుంది న‌భా. ఈ సినిమాతో ఎలాగైన పెద్ద హిట్టు కొట్టి మ‌ళ్లీ ఫాంలోకి రావాల‌ని ఎదురు చూస్తోంది న‌భాన‌టేశ్‌. నితిన్ చిత్రంతో నైనా త‌న‌కు మ‌ళ్లీ లక్ క‌లిసొస్తుంద‌ని ఎదురు చూస్తున్న న‌భాకు హిట్టు ప‌డాల‌ని ఆశిద్దాం.

రీమేక్‌పైనే ఆశ‌లు పెట్టుకున్న‌ న‌భాన‌టేశ్‌..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts