
సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ ద్వారా ప్రేక్షకులను పరిచయమైన సుధీర్ కేవలం కమెడియన్‌గానే కాకుండా.. యాంకర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్, నటుడిగా కూడా సత్తా చాటాడు. ప్రస్తుతం తన మల్టీ టాలెంట్స్‌తో బుల్లితెరను ఏలేస్తున్న సుధీర్‌కు.. హీరో స్థాయిలో ఫాలోంగ్ ఉంది అనడంలో సందేహమే లేదు.
అయితే బుల్లితెర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుధీర్.. తాజాగా ఓ రేర్ రికార్డు క్రియేట్ చేశాడు. దేశవ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటులను ఎంపిక చేసే ఆర్మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. అందులో సుడిగాలి సుధీర్ పేరు కూడా ఉండడం విశేషం.
ఉత్తమ ఎంటర్టైనర్ విభాగంలో తెలుగు నుంచి సుడిగాలి సుధీర్ ఎంపికయ్యాడు. ఢీ షో నుంచి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు సుధీర్. ఇక తెలుగు నుంచి మరెవరికి దక్కని ఈ అరుదైన ఘనత సుధీర్ వశం కావడంతో.. ఆయన అభిమానులు అనందంతో ఉప్పొంగిపోతున్నారు. మరోవైపు అలాగే, హిందీలో కపిల్ శర్మ, తమిళంలో పుగజ్, బెంగాళీలో అభిర్ చటర్జీ, మరాఠీలో భానూ కదమ్ అనే ఆర్టిస్టులు ఉత్తమ ఎంటర్టైనర్లుగా ఎంపికయ్యారు.