జబర్దస్త్ జడ్జ్‌లు రోజా, మ‌నోల‌ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

January 17, 2021 at 12:18 pm

బుల్లితెర హిట్ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్న ఈ షో ద్వారా ఒక్కరు ఇద్దరు కాదు ఎంద‌రో ఆర్టిస్టులు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యారు. ఎంద‌రో క‌మెడియ‌న్స్‌కు లైఫ్ ఇచ్చిన ఈ షోలో అన‌సూయ‌, ర‌ష్మి గౌత‌మ్ యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక మల్లెమాల ప్రొడక్షన్స్ మొదలుపెట్టిన ఈ షోలో మొద‌ట నాగబాబు, రోజా జడ్జులుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే ఈ మధ్యే మెగా బ్రదర్ ఈ షో నుంచి తప్పుకున్నాడు. ఆయన వెళ్లినా కూడా రోజా మాత్రం ఇంకా జడ్జిగా కొనసాగుతున్నారు. అనంత‌రం నాగ‌బాబు స్థానంలో సింగ‌ర్ మ‌నో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంటున్నారు. అయితే తాజాగా రోజా, మ‌నోల రెమ్యున‌రేష‌న్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

వాస్త‌వానికి జ‌డ్జ్‌లుగా కొన‌సాగుతున్న రోజా, మ‌నోలు ఎంత ప‌రితోష‌కం పుంచుకుంటున్నార‌న్న‌ది చాలా మందికి ఉన్న ప్ర‌శ్న. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. రోజా నెలకు పాతిక లక్షలు అందుకుంటుంది. ఇక మనో నెలకు 10 లక్షలు అందుకుంటున్నార‌ట‌. అలాగే అనసూయ 5 లక్షలు, రష్మీ 4 లక్షలు నెలకు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

జబర్దస్త్ జడ్జ్‌లు రోజా, మ‌నోల‌ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts