నిర్మాతను స్టేజ్‌పైనే సారీ చెప్ప‌మ‌న్న జగపతిబాబు.. కార‌ణం ఏంటంటే?

January 19, 2021 at 10:32 am

సాధార‌ణంలో కులాలు, మ‌తాల‌పై కొంద‌రికి చాలా ప‌ట్టింపు ఉంటుంది. కానీ, కొంద‌రు మాత్రం అన్ని కులాలు, అన్ని మ‌తాలు ఒక్క‌టేగా భావిస్తారు. అలాంటి వారిలో సినీ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు ఒక‌రు. వీరమాచనేని అంటే కమ్మకులంలో పెద్ద ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన జ‌గ‌పతిబాబు కులానికి ఎప్పుడు వ్యతిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తారు. సమాజంలో కుల వ్యవస్థ పోవాలని, అప్పుడే మన దేశం బాగుపడుతుందని జగపతి బాబు ఎన్నో ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఇక త‌న ద‌గ్గ‌ర ఎవ‌రైనా కులం గురించి ప్ర‌స్తావిస్తే.. వారిని ఏకిపారేయ‌డం జ‌గ‌ప‌తిబాబుకు ఉన్న అల‌వాటు. అయితే అలాంటి జగపతిబాబును తాజాగా ఓ నిర్మాత కులం పేరుతో సంబోధించాడు. జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలో నటించిన ‘FCUK(ఫాదర్‌-చిట్టి-ఉమ-కార్తీక్‌)’ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయ‌నున్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఇక ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించగా.. నిర్మాత మాట్లాడుతూ జగపతిబాబుని పేరుతో కాకుండా చౌదరి అని సంబోధించారు. దీంతో జగపతిబాబు ఇప్పుడు క్యాస్ట్ మెన్షన్ చేశావ్ ఎందుకు?? చౌదరి అని.. సారీ చెప్పు.. అని స్టేజ్‌పైనే అడిగేశారు. దీంతో వెంట‌నే నిర్మాత దామోదర ప్రసాద్ సారీ సారీ.. నేను ఫస్ట్ నుంచి జగపతిబాబుని చౌదరి అని పిలిచే అలవాటు ఉంది.. ఆ అలవాటులో భాగంగా చౌదరి అని వచ్చేసింద‌ని క్ష‌మాప‌ణ కోరారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

 

నిర్మాతను స్టేజ్‌పైనే సారీ చెప్ప‌మ‌న్న జగపతిబాబు.. కార‌ణం ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts