ఆ ఇద్ద‌రు యంగ్ హీరోల‌తో జ‌గ‌ప‌తిబాబు పోటీ.. ఇక ప్రేక్ష‌కుల‌కు పండ‌గే!

January 28, 2021 at 8:09 am

క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చిన లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో షూటింగ్ పూర్తి అయిన చాలా సినిమాలు విడుదల‌ ఆగిపోయింది. అయితే ఇటీవ‌ల థియేట‌ర్లు ఓపెన్ కావ‌డంతో.. అప్పుడు ఆగిన సినిమాల‌న్నీ ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12న ఒక్కరోజే ఏకంగా మూడు సినిమాలు విడుదల‌కు రెడీ అయ్యాయి.

Devi Sri Prasad Back On Track With Uppena

వీటిలో మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `ఉప్పెన` ఒక‌టి. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుండగా తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడు. అయితే ఈ సినిమాన ఫిబ్ర‌వ‌రి 12న విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్ర‌క‌టించింది. మ‌రోవైపు శ్రీనివాస్ నాయుడు ద‌ర్శ‌క‌త్వంలో ఆది, సుర‌భి హీరోహీరోయిన్‌గా తెరకెక్కిన ‘శశి’ చిత్రం కూడా ఫిబ్ర‌వ‌రి 12నే విడుద‌ల కానుంది.

Sashi Movie Stills: Aadi and Surbhi Photos from Sashi • AgraTara

ఈ సినిమాపై కూడా బాగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అయితే ఈ యంగ్ హీరోల‌తో జ‌గ‌ప‌తిబాబు కూడా పోటీ ప‌డేందుకు రెడీ అయ్యాడు. ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లోరామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా తెరకెక్కుతోన్న ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్-చిట్టి-ఉమా-కార్తీక్‌)` చిత్రాన్ని కూడా ఫిబ్రవరి 12న విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీంతో మంచి అంచ‌నాలు ఉన్న మూడు చిత్రాలు ఒకేరోజు విడుద‌లైతే.. ప్రేక్ష‌కుల‌కు పండ‌గే అంటున్నారు.

ఆ ఇద్ద‌రు యంగ్ హీరోల‌తో జ‌గ‌ప‌తిబాబు పోటీ.. ఇక ప్రేక్ష‌కుల‌కు పండ‌గే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts