నెత్తిన ముళ్ల కిరీటం, చేతుల‌కు శిలువతో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు లుక్..!!

January 25, 2021 at 1:21 pm

గతంలో ఫ్యామిలీ హీరోగా తన నటనతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన జ‌గ‌ప‌తి బాబు సెకండ్ ఇన్నింగ్స్‌లో స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తూ మరలా దూసుకుపోతున్నాడు. తండ్రిగా, మామ‌గా, విల‌న్‌గా ఇలా అన్ని పాత్ర‌లు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు మన జగ్గు భాయ్. ప్ర‌స్తుతం ఎఫ్‌సీయూకే’ ఫాదర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌ మూవీ చేస్తున్నాడు. విద్యాసార‌గ‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కార్తీక్‌, అమ్ము అభిరామి ముఖ్య పాత్ర‌లు పోషించారు. ఫిబ్ర‌వ‌రి 12న ఈ సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.

ఎఫ్‌సీయూకే సినిమా పూర్తి రొమాంటిక్ కామెడీగా తెర‌కెక్కింద‌ని చెప్పిన జగ్గు భాయ్ ఈ చిత్రంలో తండ్రిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. ఎప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ‌గ‌ప‌తి బాబు త‌న మూవీస్ కి సంబంధించిన విశేషాల‌ను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా చేతుల‌కు శిలువ‌, నెత్తిన కిరీటం ఉన్న ఫొటోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేశాడు. దీనికి ఎలాంటి క్యాప్ష‌న్ లేకపోయే సరికి అభిమానులు క‌న్ఫ్యూజ్ లో పడ్డారు. కాస్త క్లారిటీ ఇవ్వండి అంటూ నెటిజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

నెత్తిన ముళ్ల కిరీటం, చేతుల‌కు శిలువతో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు లుక్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts