జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ మ‌ళ్లీ వాయిదా..!!

January 22, 2021 at 3:20 pm

జేమ్స్ బాండ్ మూవీ నో టైమ్ టు డై మ‌ళ్లీ మరొకసారి వాయిదా ప‌డింది. కోవిడ్ కారణంగా ఆ సినిమాను ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో విడుదల చేయ‌నున్నారు. అసలు వాస్త‌వానికి కిందటి ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్‌కు వాయిదా వేశారు. అయితే క‌రోనా నుంచి ఇంకా థియేట‌ర్లు పూర్తిగా కోలు కోలేద‌ని, అందుకే ఆ మూవీని మరలా వాయిదా వేస్తున్న‌ట్లు సినీ నిర్మాత‌లు తెలిపారు.

ఈ ఏడాది అక్టోబ‌ర్ 8వ తేదీన నో టైమ్ టు డై ని విడుదల చేయ‌నున్నారు. ఎంజీఎం, కామ్‌కాస్ట్ కార్ప్స్ యూనివ‌ర్స‌ల్ పిక్చ‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. గ‌త ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని మొద‌ట న‌వంబ‌ర్‌కు వాయిదా వేశారు. క‌రోనా కారణంగా మ‌ళ్లీ 2021 ఏప్రిల్‌కు వాయిదా వేశారు. సుమారు 200 మిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌ర్చుతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో బ్రిటీష్ ఏజెంట్ పాత్ర‌లో డానియ‌ల్ క్రేగ్ న‌టిస్తున్నాడు.

జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ మ‌ళ్లీ వాయిదా..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts