మ‌ళ్లీ థియేట‌ర్‌లోకి వ‌స్తున్న ఎన్టీఆర్ హిట్ సినిమా.. ఖుషీలో ఫ్యాన్స్‌!

January 18, 2021 at 10:48 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. 2018లో `అరవింద సమేత వీర రాఘవ` సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన మ‌రో సినిమా విడుద‌ల కాలేదు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ న‌టించిన ఓ హిట్ సినిమా మ‌ళ్లీ థియేట‌ర్‌లోకి రాబోతోంది. ఇంత‌కీ ఆ చిత్రం ఏదో కాదు.. జై లవ కుశ. కె.ఎస్.రవీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభనయం చేశాడు. రాశి ఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్‌రాం ఎన్.టి.ఆర్.ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన మూడు పాత్ర‌ల‌ను ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

బాక్సాఫీసు దగ్గర కూడా ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఈ చిత్రాన్ని నంద‌మూరి అభిమానుల కోరిక మేర‌కు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్‌లో జనవరి 22న సాయంత్రం 7 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌కట‌న కూడా వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాను మ‌రోసారి థియేట‌ర్‌లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు.

మ‌ళ్లీ థియేట‌ర్‌లోకి వ‌స్తున్న ఎన్టీఆర్ హిట్ సినిమా.. ఖుషీలో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts