ఎన్టీఆర్ ఫైన్ క‌ట్టిన అభిమాని.. బ‌దులు ఏం అడిగాడో తెలుస్తే షాకే!

January 23, 2021 at 9:10 am

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఈయ‌న‌కు కేవ‌లం టాలీవుడ్‌నే కాదు ఇత‌ర భాష‌ల్లోనూ ఎంద‌రో అభిమానులు ఉన్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సొంత కాళ్ల‌పై స్టార్ హీరోగా ఎదిగిన ఈ తార‌క రాముడు వృత్తి ప‌రంగానే కాకుండా.. వ్య‌క్తిత్వ ప‌రంగా కూడా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా యంగ్ టైగర్ అభిమాని ఒకరు తారక్ కు సంబంధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించాడు.

ఔటర్ రింగ్ రోడ్ పై ఓవర్ స్పీడ్‌‌లో కారు నడిపినందుకుగానూ ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్‌కి రూ.1035 జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఓ అభిమాని ఆన్‌లైన్ ద్వారా తారక్ చెల్లించాల్సిన ఫైన్ తాను చెల్లించేశారు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, ఆ త‌ర్వాత స‌ద‌రు అభిమాను చేసిన ప‌నే ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఎన్టీఆర్ ఫైన్ చెల్లించిన త‌ర్వాత‌.. ఆ స్క్రీన్ షాట్‌‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేశాడు. అంతేకాదు, రిట‌ర్న్ గిఫ్ట్‌గా ఆర్ఆర్ఆర్ టికెట్ల‌ను కోరి.. షాక్ ఇచ్చారు. ఆ టికెట్లు కూడా తానుండే కూకట్‌పల్లి ఏరియాలోని బ్రమరాంభ, మల్లిఖార్జున థియేటర్లలో ఇస్తే చక్కగా స్నేహితులతో కలిసి సినిమాను ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. దీంతో స‌ద‌రు అభిమాను పోస్ట్ కాస్త వైర‌ల్‌గా మారింది. మ‌రి దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఎన్టీఆర్ ఫైన్ క‌ట్టిన అభిమాని.. బ‌దులు ఏం అడిగాడో తెలుస్తే షాకే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts