ఆ మల్టీటాలెంటెడ్ హీరోతో రొమాన్స్‌కి రెడీ అవ‌తున్న‌ కాజ‌ల్?

January 22, 2021 at 10:02 am

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌ల గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక పెళ్లి త‌ర్వాత ఎక్కువ ఆల‌స్యం చేయ‌కుండా మ‌ళ్లీ షూటింగ్స్‌తో బిజీ అయింది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం కాజ‌ల్ చిరంజీవితో `ఆచార్య‌`, మంచు విష్ణుతో `మోస‌గాళ్లు`, కమల్ హాసన్‌తో `భారతీయుడు 2`తో పాటు అటు బాలీవుడ్‌లో ‘ముంబై సాగా`లో కూడా న‌టిస్తోంది.

ఇక తాజాగా కాజ‌ల్ మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. ప్రముఖ దర్శకుడు, డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌, ఇండియన్ మైఖేల్ జాక్సన్‌, మల్టీటాలెంటెడ్ హీరో ప్రభుదేవాతో రొమాన్స్ చేసేందుకు కాజ‌ల్ సిద్ధం అవుతున్న‌ట్టు తెలుస్తోంది.

Prabhu Deva and Kajal Aggarwal to team up for the first time in  'Gulebagavali' director's next | Tamil Movie News - Times of India

దర్శకుడు కల్యాణ్.. ప్ర‌భుదేవా, కాజ‌ల్ హీరోహీరోయిన్లు ఓ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుందని స‌మాచారం. కాగా, ఇంతకు ముందు డీకే దర్శకత్వంలో హారర్‌ సినిమాలో కాజల్, ప్రభుదేవా జంటగా కనిపిస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఎలా ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రి తాజా ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.

ఆ మల్టీటాలెంటెడ్ హీరోతో రొమాన్స్‌కి రెడీ అవ‌తున్న‌ కాజ‌ల్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts