ఫిబ్రవరి 12న కాజల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్…!!

January 26, 2021 at 12:24 pm

టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే వెబ్ సిరీస్‌ లో నటించింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ వెబ్ ‌సిరీస్ ఫిబ్రవరి 12న హాట్ స్టార్‌లో రిలీజ్రా కాబోతుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసారు. పోస్టర్ ను బట్టి చుస్తే ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్ గా రానున్నట్లు అర్ధం అవుతుంది.

ఈ లైవ్ టెలికాస్ట్ తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠి భాషల్లో కూడా అందుబాటులోకి వస్తోంది. కాజల్ వెబ్ సిరీస్ లో నటించడం ఇదే మొదతి సారి కావటం మరో విశేషం. ప్ర‌స్తుతం కాజ‌ల్ అగర్వాల్ మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఫిబ్రవరి 12న కాజల్ లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్…!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts