కశ్మీర్‌ వీరనారి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్…!?

January 16, 2021 at 3:41 pm

బాలీవుడ్ లో కథాంశాల ఎంపికలో వైవిధ్యానికి, పాత్రల పరంగా ప్రయోగాలకు ఎప్పుడూ రెడీగా ఉంటుంది ప్రముఖ ‌ కథానాయిక కంగనా రనౌత్‌. తాజాగా ఆమె ఓ చారిత్రక చిత్రంలో వీరనారి పాత్రను పోషించడానికి సిద్ధం అవుతుంది. వివరాల్లోకి వెళితే పదో శతాబ్దంలో కశ్మీర్‌ను పరిపాలించిన రాణీ దిద్దా వీరోచిత పోరాటగాథ ఆధారంగా మణికర్ణిక రిటర్న్స్‌ : ది లెజెండ్‌ ఆఫ్‌ దిద్దా పేరుతో ఒక చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

కమల్‌జైన్‌ నిర్మించబోతున్న ఈ సినిమాలో కంగనారనౌత్‌ టైటిల్‌ రోల్‌ను పోషించడంతో పాటు దర్శకత్వ బాధ్యతల్ని కూడా చెప్పటనుంది. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ మొత్తం రెడీ అయిందని, ఈ ఏడాది ద్వితీయార్ధంలో మూవీ చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. పోలియో వల్ల కలిగిన అంగవైకల్యంతో బాధపడుతూ కూడా తన శత్రువులపై పోరాటం చేసిన పరాక్రమశీలిగా రాణి దిద్ద్దా కీర్తిని సంపాదించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.

కశ్మీర్‌ వీరనారి పాత్రలో బాలీవుడ్ హీరోయిన్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts