
తమిళ స్టార్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి.. కేవలం హీరోగానే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్‌తో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి హిందీ, తమిళ్ మరియు తెలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే ఈయన విలన్‌గా నటించిన `మాస్టర్` చిత్రం మరికొన్ని గంట్లో విడుదల కానుంది.
ఇటు తెలుగులో విజయ్‌సేతుపతి నటించిన ఉప్పెన చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అంధాధున్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన శ్రీరామ్ రాఘవన్.. త్వరలోనే విజయ్ సేతుపతితో ఓ సినిమా చేయనున్నాడు.
ఇప్పటికే శ్రీరామ్ సేతుపతికి కథ చెప్పగా.. ఆయన గ్రీన్ సిగ్నెల్ కూడా ఇచ్చేశారట. అయితే ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు.. సేతుపతి సరసన నటించేందుకు కత్రినాను ఒప్పించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే.. రేర్ కాంబో సెట్టైనట్టే అవుతుంది.