
కీర్తి సురేష్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `మహానటి` చిత్రంతో సూపర్ క్రేజ్ అందుకున్న కీర్తి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో రంగ్ దే, గుడ్ లక్ సఖి, సర్కారు వారి పాట.. మలయాళంలో మరక్కర్.. తమిళ్లో అన్నాత్తే చిత్రాల్లో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదిలా ఉంటే.. కెరీర్ ప్రారంభం నుంచి కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల బాగా సన్నబడ్డారు.
అయితే సన్నగా మారిన కీర్తి లుక్‌పై మొదటి నుంచి చాలా మంది పెదవి విరుస్తూ వచ్చారు. చాలా మంది నెటిజన్లు కీర్తి బొద్దుగా ఉంటేనే బాగుండేదని.. సన్నగా మారడం వల్ల ఆమె ముఖం కల తప్పిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్.. సన్నగా మారిపోయిన కీర్తి మహేష్ అస్సలు సెట్ కాదని కూడా కామెంట్లు పెట్టారు.
అయితే ఇలాంటి తరుణంలో కీర్తి మళ్లీ బొద్దుగా తయారువుతోంది. సంక్రాంతి సందర్భంగా కీర్తి సురేష్ కొన్ని ఫొటోలను తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో కీర్తి కాస్త బొద్దుగా కనిపిస్తున్నారు. దీంతో కీర్తి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. కీర్తి లుక్ ఇప్పుడు అద్భుతంగా ఉందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.