తమన్నాకు కోర్టు నోటీసులు.. సూపర్ ట్విస్ట్ ఏంటంటే?

January 28, 2021 at 9:21 am

త‌మ‌న్నా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాష‌ల్లో కూడా న‌టించి స‌త్తా చాటిన ఈ బ్యూటీ.. ఇప్ప‌టికీ స్టార్ హీరోయిన్‌గా గానే కొన‌సాగుతోంది. ఇక ఇన్నేళ్ల కెరీర్‌లో త‌మ‌న్నా ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకోలేదు. ఆమెపై రూమ‌ర్స్ కూడా త‌క్కువే. కానీ, అలాంటి త‌మ‌న్నాకు కోర్టు నోటీసులు పంప‌డం.. అభిమానుల‌ను షాక్‌కు గురి చేస్తోంది.

ఇంత‌కీ త‌మ‌న్నా కోర్టు నోటీసులు రావ‌డం వెన‌క కార‌ణం ఏంటంటే.. ఆన్‌లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్నందుకే కోర్టు ఆమెకి నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ వేదిక రమ్మీ గేమ్ సూప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే‌. అయితే మ‌రోవైపు చాలా మంది ఎంతో డబ్బును కోల్పోయారని, ఆర్థికంగా చితికి అప్పులపాలయ్యారనే ఆరోపణలు కూడా ఈ గేమింగ్ యాప్‌పై ఉన్నాయి.

ఇందులో భాగంగా.. ఈ ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ త్రిచూర్‌కి చెందిన పోలీ వర్గీస్‌ కేరళ హైకోర్టులో పిల్‌ వేశాడు. దీంతో కేసు పరిశీలించిన హైకోర్టు , ఆన్‌లైన్‌ రమ్మీకి అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న త‌మ‌న్నాతో పాటు మలయాళీ నటుడు అజు, క్రికెట్ విరాట్ కోహ్లిల‌కు కూడా నోటీసులు ఇచ్చింది. అయితే సూప‌ర్ ట్విస్ట్ ఏంటంటే.. త‌మ‌న్నా రమ్మీ గేమ్ విష‌యంలో నోటీసులు రావ‌డం ఇది రెండోసారి. గతంలో మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ సైతం ఆన్ లైన్ ర‌మ్మీ గేమ్‌కు బ్రాండ్ అంబాసీడర్‌గా ఉన్నందుకు త‌మ‌న్నాకు నోటీసులు జారీ చేసింది.

తమన్నాకు కోర్టు నోటీసులు.. సూపర్ ట్విస్ట్ ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts