
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన `కేజీఎఫ్` దేశవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా `కేజీఎఫ్ 2` రాబోతోంది. ఒక కేజీఎఫ్ 1 ఇండియా లెవల్లో గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో దేశం మొత్తం కేజీఎఫ్ 2 కోసం ఎంతో ఎగ్జయిటింగ్ గా ఎదురు చూస్తోంది.
ఇప్పటికే కేజీఎఫ్ 2 షూటింగ్ పూర్తి అవ్వగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇక ఇటీవల యష్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టీజర్ కూడా విడుదలై.. ప్రపంచ రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఈ క్రేజీ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఆ వార్త ఏంటంటే.. ఈ సినిమా క్లైమాక్స్ కోసం చిత్ర యూనిట్ భారీగానే ఖర్చు చేశారట. క్లైమాక్స్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేసిన అధీరా పాత్రకు మరియు రాకీ భాయ్‌కు ఉండే భీకర పోరాట సన్నివేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారట. అంతేకాదు, ఈ ఒక్క క్లైమాక్స్ సీన్ కోసమే నిర్మాణ సంస్థ హోంబలె వారు ఏకంగా రూ.12 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇక మొత్తం సినిమాకు వంద కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.