
గత కొన్నాళ్లుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సముద్రఖని పేరు తరచుగా వినిపిస్తూ వస్తుంది. ఈ కోలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఇప్పుడు తాజాగా తనలోని నటనా ప్రతిభను రోజు రోజుకీ చూపిస్తూ ముందుకెళ్లే పనిలో ఉన్నాడు. 2020లో అలా వైకుంఠపురం సినిమాతో సంక్రాంతి హిట్, 2021లో క్రాక్ మూవీతో మరో సంక్రాంతి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు సముద్రఖని.
ఈ రెండు సినిమాలు యాక్టర్ గా సముద్రఖనిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ నటుడికి ఇపుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నటించే ఛాన్స్ వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. ఇప్పటికే ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. ఇపుడు మరే క్రేజీ మూవీలో నటించే ఛాన్స్ లభించింది. క్రాక్ ప్రమోషన్స్ లో సముద్రఖని మాట్లాడుతూ పవన్ కల్యాణ్ రానా కాంబినేషన్ లో వస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నానని చెప్పాడు.