
కోలీవుడ్ ప్రముఖ స్టార్ హీరో సూర్యకు తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు తమిళంతో పాటు తెలుగులోనూ ఆయనకి చాలా మంది ఫ్యాన్ ఫాలోవర్స్ఉన్నారు. అయితే ఈ హీరో ఇప్పటి వరకు స్ట్రెయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. తెలుగులో మంచి సినిమా చేసేందుకు సరైన డైరెక్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య కోసం ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను యాక్షన్ ప్యాక్డ్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. బోయపాటి ఈ కథను మొదట ప్రభాస్ కోసం రెడీ చేసుకోగా, ఇపుడు సూర్య చేతుల్లోకి ఈ ప్రాజెక్టు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం బోయపాటి, బాలకృష్ణతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య చిత్రం విడుదలైన తర్వాత వచ్చిన ఫలితాన్ని బట్టి సూర్య డైరెక్టర్ బోయపాటితో చిత్రాన్ని ఆఫిసిఅల్ గా అనౌన్స్ చేస్తాడేమో అంటూ వార్తలు వెల్లు వెత్తుతున్నాయి. సూర్యతో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నాడట బోయపాటి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి రానుందో లేదో అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురు చూడక తప్పదు.