
మెగాస్టార్ చిరంజీవిపై ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం దర్శకుడు కొరటాల శివనే అని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల కాంబోలో `ఆచార్య` చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించనుండగా.. రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న విడుదల చేయబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్‌గా ఎదురు చూశారు. కానీ, టీజర్ విడుదల కాకపోవడంతో.. అభిమానులు చిరు మరియు ఆచార్య యూనిట్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్సణు కూల్ చేసేందుకు చిరు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే కొరటాలతో టీజర్ కోసం డిస్కస్ చేస్తున్నట్టుగా ఓ ఫన్నీ మీమ్ ను తయారు చేసి పోస్ట్ చేశారు.
ఈ మీమ్‌లో `ఏమయ్యా కొరటాల ఇప్పటి వరకు ఆచార్య టీజర్ లేదు.. అప్డేట్ లేదు. న్యూ ఇయర్‌కు వస్తుందనుకుంటే రాలేదు.. సంక్రాంతికి వస్తుందేమో అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. నువ్వు చెప్తావా నన్ను లీక్ చేయమంటావా` అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇందులో కనిపిస్తుంది. దానికి వెంటనే లేదు సర్.. జనవరి 27 ఉదయం ఫిక్స్ సర్.. టీజర్ రిలీజ్ డేట్ చెప్పేస్తాను సర్ అంటూ కొరటాల మాటిచ్చాడు. ఈ విధంగా టీజర్ అనౌన్స్మెంట్ తేదీని వెరైటీగా ప్రకటించారు చిరు.
So here goes.. @sivakoratala @MatineeEnt@KonidelaPro @AlwaysRamCharan
#Acharya pic.twitter.com/YdZ84lkXhL— Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2021