‘రాధేశ్యామ్’ విడుద‌లపై కృష్ణంరాజు క్లారిటీ.. ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

January 21, 2021 at 8:17 am

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్ర‌న్ని రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు.

పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా లవ్ స్టోరీ గానే కాకుండా మంచి రొమాన్స్, మంచి ఎమోషన్ మూవీగా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్ర‌మంలోనే `రాధేశ్యామ్’ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు ప్రేక్షకులు వెయిట్ వేస్తున్నారు. అయితే తాజాగా ప్ర‌భాస్ పెద్ద‌నాన్న‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు రాధేశ్యామ్ విడుద‌ల ఎప్పుడో ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలనుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు.

అంతేకాదు, ఈ చిత్రంలో తాను కూడా ఓ కీలక పాత్రను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ఆ పాత్ర కోసం తాను గడ్డం కూడా పెంచానంటూ తెలిపారు. షూటింగ్ త్వరలో పూర్తి చేస్తాం. పాట‌ల పూర్తి అయిపోయాయి. ప్రభాస్ మరియు నాకు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలన్స్ ఉంది. ఇక‌ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుందని ఆయ‌న తెలిపారు. ఇక కృష్ణంరాజు చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో అవుతున్నారు.

‘రాధేశ్యామ్’ విడుద‌లపై కృష్ణంరాజు క్లారిటీ.. ఖుషీలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts