తమిళంలో రీమేక్ కానున్న ఆండ్రాయిడ్ కుంజప్పన్..!

January 28, 2021 at 2:54 pm

మలయలంలో పెద్ద విజయం సాధించిన చిత్రం ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 2019లో రిలీజ్ప అయ్యి అనేక అవార్డులనూ కూడా పొందింది. సూరజ్ వెంజారమూడు, సౌబిన్ షాహిర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రితీశ్ బాలకృష్ణన్ పోడ్వాల్ తెరకెక్కించాడు. ఈ చిత్రం గత సంవత్సరం తెలుగులో ఆండ్రాయిడ్ కట్టప్ప 2.0 అనే పేరుతో డబ్ అయ్యి ఆహాలో టెలికాస్ట్ అయింది. ఇప్పుడు ఇదే సినిమాని ప్రముఖ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తమిళంలో గూగుల్ కట్టపన్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.

 

ఈ మూవీ షూటింగ్ జనవరి 28న చెన్నైలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభం కాగా, ఇందులో కట్టపన్ పాత్రను రవికుమారే పోషిస్తుండటం మరో విశేషం. నటి నటులుగా బిగ్ బాస్ ఫేమ్ దర్శన్ త్యాగరాయ, లోస్లియా నటిస్తున్నారు. దాదాపుగా ఇరవై సంవత్సరాల తరువాత మళ్ళి కె. ఎస్. రవికుమార్ ప్రొడక్షన్ హౌస్ నుండి రానున్న ఈ సినిమాకి ఆయన శిష్యులు శబరి, శరవానన్ దర్శకత్వం వహిస్తున్నారు.

తమిళంలో రీమేక్ కానున్న ఆండ్రాయిడ్ కుంజప్పన్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts