ఆ పిల్లాడి ప‌ల్టీలకు ఫిదా అయిన కేటీఆర్‌.. వైర‌ల్‌గా వీడియో!

January 24, 2021 at 12:26 pm

ట్యాలెంట్ ఉండి కూడా గుర్తింపు రాని పిల్ల‌లు దేశ‌వ్యాప్తంగా ఎంద‌రో ఉన్నారు. అయితే సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఇప్పుడిప్పుడే ఇలాంటి వారు బ‌య‌ట‌ప‌డుతున్నారు. తాజాగా ఓ బాలుడి విష‌యంలో కూడా అదే జ‌రిగింది. పేరు తెలియ‌ని ఓ బాలుడు ఒలింపిక్స్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడి రేంజ్‌లో ప‌ల్టీలు కొడుతూ దూసుకెళ్లాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోస‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే తాజాగా ఈ వీడియో చూసిన కేటీఆర్.. స‌ద‌రు బాలిడు టాలెంట్ చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. అంతేకాదు, ఆ బాలుడి వీడియోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అత‌డి గురించి వివ‌రాలు తెల‌పాలంటూ కోరారు.

‘వావ్ ఒలింపిక్ మెడ‌లిస్ట్ త‌యార‌వుతున్నాడు. అత‌డు తెలంగాణ బాలుడా? లేక దేశంలోని ఇత‌ర ప్రాంతానికి చెందినవాడా? గొప్ప నైపుణ్యాలు ఉన్న ఈ బాలుడిని ప్రోత్స‌హించాల‌నుకుంటున్నాను’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వ‌యంగా కేటీఆరే ట్వీట్ చేయ‌డంలో.. స‌ద‌రు బాలుడి వీడియో మ‌రింత వైర‌ల్‌గా మారింది.

ఆ పిల్లాడి ప‌ల్టీలకు ఫిదా అయిన కేటీఆర్‌.. వైర‌ల్‌గా వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts