తెలంగాణ రెండో సీఎంగా కేటీఆర్… ప‌ట్టాభిషేకం ముహూర్తం ఇదే..!

January 16, 2021 at 3:53 pm

ద‌శాబ్దాల ప్ర‌త్యేక తెలంగాణ క‌ల‌ను టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఎట్ట‌కేల‌కు నిజం చేశారు కేసీఆర్‌. 2014లో ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత కేసీఆర్ ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌ను ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా త‌మ పార్టీలో చేర్చుకుని మంత్రి ప‌ద‌వులు ఇచ్చేశారు. ఐదేళ్ల అభివృద్ధి కావ‌చ్చు.. సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చాడు.. ఆయ‌న‌కు మ‌రో అవ‌కాశం ఇద్దాం ? అన్న తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష కావొచ్చు.. ఆయ‌న వ‌రుస‌గా రెండోసారి సీఎం అయ్యారు. కేసీఆర్ సీఎం అయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త పెరిగిపోతోంద‌న్న‌ది నిజం.

16 ఎంపీ సీట్లే టార్గెట్‌గా కేసీఆర్ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు వెళితే చావుత‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా కేవ‌లం 9 సీట్ల‌తో స‌రిపెట్టుకుంది. త‌ర్వాత స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో గెలిచినా… ఇటీవ‌ల దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ అధికారానికి దూరం అయిపోయింది. త్వ‌ర‌లో జ‌రిగే నాగార్జునా సాగ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో అయినా టీఆర్ఎస్ గెలుస్తుంద‌న్న న‌మ్మ‌కాలు ఆ పార్టీ నేత‌ల‌కు ధీమాగా లేవు. ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ వార్త టీఆర్ఎస్ వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది.

సీఎం పీఠం నుంచి కేసీఆర్ త‌ప్పుకుని.. త‌న వార‌సుడు కేటీఆర్‌కు ఆ ప‌ద‌వి ఇస్తార‌ట‌. కేసీఆర్ తెలంగాణ రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుని జాతీయ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని ఉవ్విళ్లూరుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంత్రులు హ‌రీష్ రావు, ఈట‌ల రాజేంద‌ర్‌ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియ‌మించే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. కేటీఆర్‌ను వ‌చ్చే నెల 18న ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోపెడ‌తార‌ని.. అంత‌కు ముందే అయుత చండీ యాగంతో పాటు రాజశ్యామల యాగం కూడా సీఎం నిర్వహిస్తారని సమాచారం.

తెలంగాణ రెండో సీఎంగా కేటీఆర్… ప‌ట్టాభిషేకం ముహూర్తం ఇదే..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts