
తెలుగు బుల్లితెరపై రియాలిటీ షో బిగ్‌బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా గత సీజన్ లో ఆలస్యంగా మొదలు పెట్టినా , నెక్స్ట్ సీజన్లో మాత్రం త్వరగా ప్రారంభించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్లు సమాచారం. గతంలో బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ ఎక్కువగా యూట్యూబర్లు, యాంకర్లు ఉండటంతో ఈ సీజన్ ఎలా ఉంటుందోనని అందరూ మొదట్లో చాలా అనుమానాలు వ్యక్తం చేసారు. అయినప్పటికీ వారితోనూ గతేడాది బిగ్‌బాస్ కాస్త ఆసక్తికరంగా సాగింది. ఇక ఆ సీజన్ విన్నర్‌గా అభిజీత్ నిలవగా గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌కి బిగ్‌బాస్ చరిత్రలోనే అత్యధిక రేటింగ్ రావడం మరో విశేషం. ఇక తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో బిగ్‌బాస్ 5 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కంటెస్టెంట్ల కోసం నిర్వాహకుల వెతకటం ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సీజన్‌కి కూడా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. కంటెస్టెంట్ల కోసం నిర్వాహకులకు నాగార్జున ఒక సలహా ఇచ్చారట. ఈసారి కాస్త ఫేమ్ ఉన్న వారిని తీసుకోవాలని ఆయన సూచించారట. ఈ క్రమంలో జబర్దస్త కమెడియన్ ఆది, యాంకర్ రవి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా బిగ్‌బాస్ గత సీజన్ ప్రారంభం కాకముందు వినిపించిన కంటెస్టెంట్ల లిస్ట్‌లో యూట్యూబర్ మహాతల్లి జాహ్నవి పేరు కూడా బాగా వినిపించింది. ఆమెతో నిర్వాహకులు సంప్రదింపులు జరిపినట్లు కూడా సమాచారం అందింది. అంతే కాకుండా ఆమెకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధమైనట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వలన జాహ్నవి ఆ సీజన్లో పాల్గొనలేదు. కాబ్బటి ఈ సారి మహాతల్లి జాహ్నవి బిగ్‌బాస్‌లోకి ఖచ్చితంగా వెళ్లనుందని అందరు అంటున్నారు.