
గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయం అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా మహేష్ ఖాతాలో ఓ సెన్షేషనల్ రికార్డ్ వచ్చి పడింది. ఇంకా షూటింగ్ ప్రారంభం అవ్వకపోయినా.. `సర్కారు వారి పాట` సినిమా హాష్ టాగ్ ను ట్విట్టర్ ట్రెండ్ చేస్తూ మిలియన్స్ కొద్దీ ట్వీట్స్ తో అదరగొట్టారు.
ఇప్పుడు ఆ మార్క్ కాస్తా 100 మిలియన్ క్రాస్ అయ్యింది. దీంతో ఇండియా లోనే కాకుండా వరల్డ్ మొత్తం లోనే ఏ సినిమా టాగ్ కూడా టచ్ చెయ్యని రికార్డును `సర్కారు వారి పాట` సినిమా హాష్ టాగ్ క్రియేట్ చేసింది. అయితే ఈ వరల్డ్ రికార్డ్ మహేష్ ఖాతాలో పడటానికి.. కేవలం ఆయన అభిమానులే కారణం అని చెప్పాలి. వారి వల్లే ఈ రికార్డు మహేష్‌కు సాధ్యమైంది.