నమ్రత బర్త్ డే సందర్బంగా వెరైటీగా విష్ చేసిన ప్రిన్స్..!!

January 22, 2021 at 2:49 pm

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు స్పెషల్ గా విషెస్ తెలుపుతూ తన భార్య నమ్రతపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు ప్రిన్స్ మహేష్. నేను ఎంతగానో ప్రేమించే వ్యక్తి పుట్టిన రోజు నేడు. ప్రతి రోజు నీతో గడపడం నాకు ప్రత్యేకమైనదే, కానీ ఈ రోజు మరింత ప్రత్యేకం అంటూ పోస్ట్ చేసారు మహేష్.

ఈరోజు నమ్రత పుట్టినరోజు కావటం ఇది తనకు ఎంతో స్పెషల్ డే అంటూ మహేష్ బాబు తాము ఇద్దరు కలిసి దుబాయ్ లో దిగిన పిక్ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం సినీ ప్రముఖులు, మహేష్ ఫ్యాన్స్ విషెస్ తో నమ్రత పేరు ట్విట్టర్ లో మారుమోగుతోంది. మహేష్ ఫ్యామిలీ నమ్రత పుట్టినరోజు సెలెబ్రేషన్స్ కోసం నిన్న దుబాయ్ వెళ్లారు. మహేష్ సర్కార్ వారి పాట చిత్రం షూటింగ్ కోసమే దుబాయ్ వెళ్లాడని, నమ్రత పుట్టిన రోజులు కూడా అక్కడే జరుపోవడానికి ఫ్యామిలిని కూడా తీసుకెళ్లాడని దీని బట్టి తెలుస్తోంది.

నమ్రత బర్త్ డే సందర్బంగా వెరైటీగా విష్ చేసిన ప్రిన్స్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts