జిమ్‌లో చెమ‌ట‌లు చిందిస్తున్న మ‌హేష్‌.. వైర‌ల్‌గా వీడియో!

January 21, 2021 at 7:59 am

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు.. గ‌త కొంత కాలంగా వ‌రుస స‌క్సెస్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు నలభై లో కూడా ఇరవైలా కనిపించేటంతటి అందం మహేష్ బాబు సొంతం. మిల్కీ బాయ్‌ అంటూ ఇప్పటికీ ఈయన్ని ఎంద‌రో అమ్మాయిలు ఆరాధిస్తూనే ఉంటారు. అందం విష‌యంలో కుర్ర హీరోల‌కు పోటీ ఇస్తున్న మ‌హేష్‌.. ఫిట్నెస్ కు కూడా ప్రాధాన్యత ఇస్తాడు.

ఈ క్ర‌మంలోనే తాజాగా తన జిమ్ వీడియోను షేర్ చేసాడు మహేష్. వర్కవుట్ చేస్తూ చెమ‌ట‌లు చిందిస్తున్న‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో మహేష్ ‘బాక్స్ జంప్స్’ చేశాడు. ఈ వీడియోను చూసి మహేష్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అంతేకాదు, మ‌హేష్ వీడియో తెగ వైర‌ల్ చేస్తున్నారు.

కాగా, మ‌హేష్ ప్ర‌స్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు. పరుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుంది. త్వ‌ర‌లోను ఈ సినిమా షూటింగ్ మొద‌లు కానుంది.

జిమ్‌లో చెమ‌ట‌లు చిందిస్తున్న మ‌హేష్‌.. వైర‌ల్‌గా వీడియో!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts