ఆమె విషయంలో పట్టింపుల్లేవ్ అంటున్న మేకర్స్..!!

January 19, 2021 at 3:44 pm

నాచురల్ బ్యూటీ, ప్రముఖ నటి సాయి పల్లవిని స్పెషల్ గా చూస్తున్నారు మూవీ మేకర్స్. సాధారణంగా ఒక మూవీ కథను, పాత్రలను బట్టి హీరో, హీరోయిన్‌లను ఎంపిక చేస్తారు. ఎత్తు ఉన్న హీరోకి హీరోయిన్ కూడా కాస్త ఎత్తు ఉండేలా చూసుకుంటారు మేకర్స్. కానీ నాచురల్ బ్యూటీ సాయిపల్లవి విషయంలో అలా ఆలోచించటం లేదు మేకర్స్. ఈ అమ్మడు కాస్త పొట్టిగా ఉన్నా కూడా ఆరడుగుల హీరోల తన పక్కన ఎంపిక చేస్తున్నారు. సాయి పల్లవి మొదటి చిత్రం కూడా అదే విధంగా ఆరడుగుల హీరో వరుణ్ తేజ్ సరసన చేసింది. దాంతో మూవీ మేకర్స్ సాయి పల్లవి విషయంలో తమ కట్టు బాట్లను, పట్టింపులు పక్కన పెట్టారు. సాయి పల్లవి హైట్‌కి తన పక్కన నాని, శర్వానంద్ వంటి అవేరేజ్ హైట్ ఉన్న హీరోస్ అయితే బాగుంటుంది ఇంకా చూడముచ్చటగా ఉంటుంది.

కానీ ఈ ముద్దు గుమ్మకి అలాంటివేమీ పట్టించుకోకుండా మూవీ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల టాలీవుడ్ భల్లాల దేవుడు రానాతో విరాట పర్వంచిత్రంలో సాయి పల్లవి చేసింది. రానా హైట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆరడుగుల పై మాటే. దాంతో ఈ చిత్రంలో రానా సరసన సాయిపల్లవి సెట్ అవుతుందా అని అభిమానులు కాస్త ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఆరడుగుల హీరో గోపీచంద్ సరసన కూడా ఈ అందాల గుమ్మని అడిగారట. దర్శకుడు తేజ గోపీచంద్ హీరోగా అలమేలుమంగ-వెంకటరమణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‌గా సాయిపల్లవిని ఎంపిక చేశారట. సాయి పల్లవికి వరుసగా ఆరడుగుల హీరోలతో మూవీ అవకాశాలు రావడం విశేషం. అయితే ఈ అమ్మడి అభినయం ముందు హైట్ పెద్ద సమస్య కాదని మేకర్స్ ముఖ్య ఉద్దేశం ఏమో మరి.

ఆమె విషయంలో పట్టింపుల్లేవ్ అంటున్న మేకర్స్..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts