
షూటింగులతో ఎప్పుడు బిజీ బిజీగా ఉండే సినీ నటీనటులు ఏమాత్రం తీరిక దొరికిన కుటుంబం తో కలిసి సేద తీరడానికి విదేశాలకు వెళ్లిపోతుంటారు. ఫ్యామిలీతో సరదాగా ట్రిప్‌కు వెళ్తుంటారు. ఈ మధ్య కాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఎక్కువగా మాల్దీవుల్లో బాగా దగుపుతున్నారు. ప్రస్తుతం మాల్దీవులు సెలబ్రిటీలకు ఫేవరెట్ స్పాట్‌గా మారినట్లు తెలుస్తోంది. తాజాగా మంచు కుటుంబం కూడా మాల్దీవుల్లో వాలిపోయారు. మంచు మోహన్‌బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాన్నిఇంకా వాతావరణం ని ఆస్వాదిస్తున్నారు.
మాల్దీవులు చల్ల ఆహ్లాదకరంగా ఉందని ఆకాశం, బీచ్‌లతో ఇక్కడి ప్రకృతి అందాలు చాలా బాగున్నాయని మంచు లక్ష్మీ పేర్కొంది. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పోతే మోహన్‌బాబు తన భార్యతో సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Beaching until further notice! 😉
Enjoying the beautiful sunset with nana and amma! 🌅❤️❤️❤️ It's so good to be finally out of the house and relish some quality time with the fam at @LUXSouthAri!✨
We are in heaven 😍🌊🌴🐚👙🐬🐋 pic.twitter.com/WH2zmbNWr2— Lakshmi Manchu (@LakshmiManchu) January 21, 2021