‘మంచు’ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్న వాట్సాప్ హ్యాకర్లు…!?

January 17, 2021 at 2:28 pm

ఒక పక్క వాట్సాప్ యాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ యూజర్లకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. మరో వైపు చూస్తే మంచు ఫ్యామిలీని వాట్సాప్ హ్యాకర్లు టార్గెట్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మంచు మనోజ్ వాట్సాప్ హ్యాక్ కు గురైంది. ఆయన వాట్సాప్ నుంచి వచ్చే వాటికీ దయ చేసి ఎవ్వరు రెస్పాండ్ కావద్దంటూ ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ మరియు ఫ్యాన్స్ కు కోరాడు.

కాగా ఇటీవలే మంచు లక్ష్మి వాట్సాప్ కూడా హ్యాక్ కు గురైన సంగతి మనకు తెలిసిందే. దీనికి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో స్పందిస్తూ తన వాట్సాప్ హ్యాక్ కి గురైయిందని, దయ చేసి ఎవరు తన నుంచి వచ్చే వాట్సాప్ చాట్ కు అసలు స్పందించవద్దు అని కోరారు. అయితే ఇంతకు ముందే చాలా మంది సెలెబ్రెటీల తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యిన సంగతి మనకు తెలిసిందే ఇప్పుడు తాజాగా మంచు మనోజ్ వంత అయింది.

‘మంచు’ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్న వాట్సాప్ హ్యాకర్లు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts