
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం `మోసగాళ్ళు`. హాలీవుడ్ టెక్నీషియన్ జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్, రుహానీ శర్మ, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని 24 ఫిలిం ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నాడు.
వరల్డ్ బిగ్గెస్ట్ స్కామ్ పాయింట్ ని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించారు. కరోనా లేకుంటే ఇప్పటికే ఈ చిత్రం విడుదల అయ్యి ఉండేది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదలకు డేట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోందట.
త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, శ్యామ్ సి.ఎస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్గా కాకుండా.. మంచు విష్ణుకు చెల్లెలుగా నటించడం మరో హైలైట్ అని చెప్పాలి.