ఇంకా మ‌హేష్ యంగ్‌గా క‌నిపించ‌డానికి అదే కార‌ణం:మంచు విష్ణు

January 17, 2021 at 8:09 am

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు వ‌య‌సు 45 అయినప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం ఇర‌వై ఏళ్ల యువ‌కుడిలాగా క‌నిపిస్తుంటారు. సాధార‌ణంగా ఎవ‌రికైనా వ‌య‌సు పెరుగుతున్న కొద్ది.. అందం త‌గ్గుతుంది. కానీ, మ‌హేష్ విష‌యంలో అందుకు భిన్నంగా జ‌రుగుతోంది. మ‌హేష్ వ‌య‌సు యాబైకి చేరువ‌వుతున్నా.. అందం విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌తో పోటీ ప‌డుతున్నారు.

సాటి హీరోలు కూడా మహేష్ బాబు అందానికి ఫిదా అవుతారు. అయితే మ‌హేష్ ఈ వ‌య‌సులోనూ ఇంకా యంగ్‌గా క‌నిపించ‌డానికి కార‌ణం ఏంటో చెప్పేశాడు మంచి విష్ణు. తాజాగా మంచు విష్ణు సతీమణి విరొనికా పుట్టినరోజు వేడుకల్లో మహేష్‌ తన భార్య నమ్రతాతో కలిసి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా విష్ణు, విరొనికా, మహేష్‌, నమ్రత ఫొటోలకు పోజులిచ్చారు.

అయితే ఈ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకున్న మంచు విష్ణు.. `ఈ ఫొటోలోని వ్యక్తి వయసు పెరుగుతున్న కొద్దీ యువకుడిగా మారిపోతున్నాడు. ఆయన అంత అందంగా ఉండటానికి కారణం ఆయన మంచితనమే’ అని మ‌హేష్ అందంపై ఆస‌క్తిక కామెంట్స్ చేశాడు. దీంతో విష్ణు చేసిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

ఇంకా మ‌హేష్ యంగ్‌గా క‌నిపించ‌డానికి అదే కార‌ణం:మంచు విష్ణు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts