శ్రీను వైట్లను శాడిస్ట్ అన్న మంచు విష్ణు.. కార‌ణం ఏంటంటే?

January 28, 2021 at 9:54 am

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల‌ను మంచు విష్ణు ఏకంగా శాడిస్ట్ అనేశాడు. మ‌రి మంచు విష్ణు అంత మాట ఎందుకు అనాల్సి వ‌చ్చిందో తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. శ్రీను వైట్ల- మంచు విష్ణు కాంబోలో త్వ‌రోల‌నే `డీ అండ్ డీ` సినిమా రాబోతోన్న సంగ‌తి తెలిసిందే.

గ‌తంలో ల‌వ్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చి సూప‌ర్ హిట్ అందుకున్న ఢీకి సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం మంచు విష్ణు మైండ్ బ్లోయింగ్ మేకోవర్ లో రెడీ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇందులో భాగంగా.. జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ చెమ‌ట‌లు చిందిస్తున్న‌ వీడియోను మంచు విష్ణు షేర్ చేశాడు. దీంతో పాటు ఓ కామెంట్ కూడా చేశాడు.

`డబుల్ డోస్ కోసం రెడీ అవుతున్నాను.. ఇంకో 45 రోజులు ఇలా వర్కవుట్లు చేయాల్సిందే.. అప్పుడే కరెక్ట్ షేప్‌లోకి వస్తాను. ఆయన ఏదైనా లుక్ కావాలని అనుకుంటే శ్రీను వైట్ల శాడిస్ట్‌లా పట్టుబడతాడు` అని ఫ‌న్నీగా కామెంట్ పెట్ట‌గా.. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూస్తే.. ఢీ2 కోసం విష్ణు గట్టిగానే కష్టపడుతున్నాడ‌ని అర్థం అవుతోంది.

శ్రీను వైట్లను శాడిస్ట్ అన్న మంచు విష్ణు.. కార‌ణం ఏంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts